రాక్షసపాలనకు గుణపాఠం చెప్పాలి
ABN, First Publish Date - 2022-12-07T00:46:22+05:30
జగన్‌రెడ్డి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని, వైసీపీకి ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ అన్నారు.
భవానీపురం, డిసెంబరు 6 : జగన్‌రెడ్డి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని, వైసీపీకి ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ అన్నారు. 44వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల సెంటర్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ అనే కార్యక్రమాన్ని మైనార్టీ నేత ఎంఎస్. బేగ్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అక్కడే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి అలాగే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాలుగు స్తంభాల సెంటర్, నాగేంద్రస్వామి గుడి, వడ్డెర వీధుల్లో నాయకులు కలియతిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టారు. చంద్రబాబు అధికారంలో రావడంతోనే ప్రజా సమస్యను పరిష్కరించడానికి వీలుంటుందని, అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్న జగనన్న రాజ్యం పోయి చంద్రన్న రాజ్యం రావాలని పార్టీ సీనియర్ నేత ఎంఎ్స.బేగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి సారిపల్లి రాధాకృష్ణ, పశ్చిమ మహిళా అధ్యక్షురాలు సుకాశి సరిత, డివిజన్ల అధ్యక్షులు పీవీ చినసుబ్బయ్య, దూది బ్రహ్మయ్య, సురభిబాలు, నేతలు వీ శ్రీనివాస్, మరుపిళ్ల రాజేష్, పరిశపోగు రాజేష్, బడుగు గణేష్, డి.ఏడుకొండలు, కిలాని యల్లారావు, ఎల్. పాల్ పాల్గొన్నారు.
ఇన్నాళ్లకు బీసీలు గుర్తొచ్చారా?
రాణిగారితోట : రాష్ట్రంలో బీసీలను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా మూడున్నరేళ్ల తరువాత బీసీలు గుర్తుకురావటం సోచనీయమని బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి మైలమూరి పీరుబాబు, 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు వేముల దుర్గారావు అన్నారు. రాణిగారితోట 18వ డివిజన్ టీడీపీ కా ర్యాలయం వద్ద మంగళవారం ఇదేం ఖర్మ మన బీసీలకు అనే నినాదంతో నిరసన ప్రదర్శన నిర్వహించటంతో పాటు డివిజన్లోని అంబేడ్కర్ విగ్రహానికి ఆ యన వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను, ఎస్సీలను అణగదొక్కుతున్న జగన్మోహన్ రెడ్డికి నేడు బీసీలపై ఇంత ప్రేమ కలగటం హాస్యాస్పదంగా ఉం దన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు నిధులివ్వకుండా కనీ సం కుర్చోవడానికి కుర్చీలు ఇవ్వకుండా తన సామాజిక వర్గానికి మాత్రం భారీగా ప్రజాధనాన్ని అంది స్తూ బీసీలకు అన్యాయం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సత్తా ఏంటో జగన్ రెడ్డికి రుచి చూపిస్తామన్నారు. కొక్కెర తిరుపతయ్య, వెంకటరమణ, రాజు, మొకరా వెంకటరమణ, వల్లూరు మధు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:46:23+05:30 IST