సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి
ABN, First Publish Date - 2022-12-27T01:36:33+05:30
ప్రభుత్వం సూచించిన ఎనిమిది అభివృద్ధి సూచికల్లో నిర్థేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషిచేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా అన్నారు.
మచిలీపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సూచించిన ఎనిమిది అభివృద్ధి సూచికల్లో నిర్థేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషిచేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా అన్నారు. కలెక్టరేట్‌లోని స్పందన సమావేశపు హాలులో స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జేసీ అపరాజితాసింగ్, అధికారులతో కలసి ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల్లో అనీమియా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. గర్భవతులు, బాలింత లు, కిశోరబాలికల్లో అనీమియా బాధితులను గుర్తించి రక్తపరీక్షలు చేయాలన్నారు. హిమోగ్లోబిన్‌శాతం తక్కువగా ఉన్నవారికి అవసరమైన మందులు అందించడంతో పాటు, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచన చేయాలన్నారు. జిల్లాలో రెండు రోజులపాటు ఆర్డీవోలు, పౌరసరఫరాలశాఖ, డ్వామా, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ వివిధశాఖల అఽధికారులు చౌకధరల దుకాణాలను తనిఖీచేసి తనకు నివేదికలు సమర్పించాలన్నారు.
ప్రతి గురువారం సీఎస్ సమీక్ష
జిల్లాలో వివిధ పథకాల అమలుతీరుపై ఇకనుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ప్రతి గురువారంసమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతినెలా రెండు, నాలుగో గురువారాల్లో వ్యవసాయ, ఉద్యాన, గృహనిర్మాణం, పశుసంవర్థకశాఖ, ఇళ్లస్ధలాలు, గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేస్తారని తెలిపారు. ఒకటీ, రెండు గురువారాల్లో ఆరోగ్యం, మహిళా సంక్షేమం పాఠశాలవిద్య తదితర శాఖలపై సమీక్ష చేస్తారన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు నివేదికలతో సమాయత్తం కావాలన్నారు. ఈ నెల 30వ తేదీన జిల్లాలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జిల్లా పర్యటనకు వస్తున్నారని గన్నవరం విమానాశ్రయం వద్ద అధికారులు తగుఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ అమలులో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు వైద్యసేవలు అందించిన ఐదుగురు వైద్యులకు ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ముడా వీసీ శివనారాయణరెడ్డి, సీపీవో శ్రీలత, డీఎ్‌సవో పార్వతి, డీఆర్‌డీఏ పీడీ పిఎ్‌సఆర్ ప్రసాద్, డీఎంఅండ్‌హెచ్‌వో గీతాబాయి జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-27T01:36:35+05:30 IST