ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రంథాలయాలు మెరుగైన సేవలు అందించాలి

ABN, First Publish Date - 2022-05-18T06:24:48+05:30

పాఠ కులకు మెరుగైన సేవలు అందిం చడం ద్వారా గ్రంథాలయ వ్యవస్థ పటిష్టత సాధ్యమౌతుందని ఆంధ్ర ప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ మాదపాటి శేషగిరిరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రంథాలయాలు మెరుగైన సేవలు అందించాలి

 ఉచిత వేసవి శిక్షణ  శిబిరం ప్రారంభంలో శేషగిరిరావు

గవర్నర్‌పేట, మే 17: పాఠ కులకు మెరుగైన సేవలు అందిం చడం ద్వారా గ్రంథాలయ వ్యవస్థ పటిష్టత సాధ్యమౌతుందని ఆంధ్ర ప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ మాదపాటి శేషగిరిరావు అన్నారు. విద్యార్థుల కోసం 45 రోజుల పాటు నిర్వహించే ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఎంజీ రోడ్డులోని ఠాగూర్‌ పౌర గ్రంథాలయంలో సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ విద్యాశాఖ, పౌర గ్రంథాలయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించడం మంచి పరిణామమన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ చిన్నారులకు చిన్ననాటి నుంచే పఠనాశక్తిని పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంఆర్‌ ప్రసన్నకుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ జమల పూర్ణమ్మ, జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు జంపాన కృష్ణకిషోర్‌, డీవైఈవో రవికుమార్‌, గ్రంథాలయాధికారి కె. నాగరాజు, లైబ్రేరియన్‌లు కళ్లేపల్లి మధుసూదనరాజు, ఏ. రామచంద్రుడు, సిబ్బంది పాల్గొన్నారు.

చిత్తరంజన్‌శాఖ గ్రంథాలయంలో...

సత్యనారాయణపురం: స్థానిక చిత్తరంజన్‌శాఖ గ్రంథాలయంలో 45 రోజుల సమ్మర్‌ క్యాంప్‌ను మంగళవారం 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ శర్వాణీ మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి  ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేయాలన్నారు. పుస్తకాలు చదివితే విజ్ఞనాన్ని పెంపొందించుకోవచ్చునన్నారు. గ్రంథాలయాధికారి సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ క్యాంప్‌ జూన్‌ 30 వరకూ జరుగుతుందని, ఇందులో పుస్తక పఠనం, చిత్రలేఖనం, పేపర్‌ ఆర్ట్‌, కథలు చెప్పడం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-18T06:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising