ఉద్యోగుల సమన్వయంతో గిరిజనాభివృద్ధి
ABN, First Publish Date - 2022-10-17T06:35:06+05:30
ప్రభుత్వ యంత్రాంగంలో సమన్వయం లేకపోవడం వ లనే ఆశించిన స్థాయిలో గిరిజనాభివృద్ధి జరగలేదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు అన్నా రు.
ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు
లబ్బీపేట/పాయకాపురం, అక్టోబరు 16 : ప్రభుత్వ యంత్రాంగంలో సమన్వయం లేకపోవడం వ లనే ఆశించిన స్థాయిలో గిరిజనాభివృద్ధి జరగలేదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు అన్నా రు. ఆదివారం బందరురోడ్డులోని హోటల్‌లో గిరిజన ప్రభుత్వ వైద్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 40 వేల మంది గిరిజన ఉద్యోగులు 32లక్షల మంది గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని, గిరిజనులే గిరిజనాభివృద్ధికి సామాజిక చైతన్యం కలిగించి, విద్య, వై ద్య, సంక్షేమ ఉపాధి రంగాల్లో తమవంతు పాత్ర పో షించాలన్నారు. శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి కమిషన్ నిరంతరం సహాయపడుతుందని అ న్నారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచం ద్ర మాట్లాడుతూ అనేక మంది వైద్యులు, ఆయా రం గాల్లో నిష్ణాతులు పదోన్నతుల వంటి శాఖాపరమైన విషయాలపై అవగాహన కల్పించుకుంటే అనేక స మస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ట్రైబల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు అదనంగా ఇస్తున్న మూ లవేతనం ప్రభుత్వం పెంచిందని, మాతృశాఖ ఉద్యోగులు వైద్యుల సమావేశానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్, కొర్రా రామలక్ష్మి, సతీష్, బాలు నాయక్, వివిధ జిల్లా ల నుంచి వచ్చిన గిరిజన వైద్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T06:35:06+05:30 IST