ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహనిర్మాణాలను వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-12-16T01:07:39+05:30

జిల్లాలో గృహనిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం కలెక్టర్‌లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో 94,256 గృహాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా, జేసీ అపరాజితాసింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో గృహనిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం కలెక్టర్‌లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో 94,256 గృహాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 7,300 గృహాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. 78వేలగృహాలు వివిద దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.

భూముల రీసర్వేపై దృష్టిసారించండి..

జిల్లాలో పేదల శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా 112 గ్రామాల్లో రీ సర్వే పూర్తయిందని కలెక్టర్‌ తెలిపారు. 101 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, 90 గ్రామాల్లో ఫైనల్‌ ఆర్వోఆర్‌ ప్రకటించడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జేసీ అపరాజితాసింగ్‌, సీపీవో శ్రీలత, హౌసింగ్‌పీడీ జీవీ సూర్యనారాయణ, జడ్పీ సీఈవో జి.శ్రీనవాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలి

డిసెంబరు 26 నాటికి ఓటర్ల సంక్షిప్త సవరణ జాబితా-2023ను సిద్ధం చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే్‌షకుమార్‌ మీనా ఓటర్ల జాబితాల తయారీ, మార్పులు, చేర్పులపై గురువారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు ఐ కిషోర్‌ పద్మావతి, విజయ్‌కుమార్‌, డీఎ్‌సవో పార్వతి, హరనాథబాబు, ఎన్నికల అధికారి శ్యామ్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising