ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పందన అర్జీల పరిష్కారానికి చర్యలు

ABN, First Publish Date - 2022-06-28T05:58:56+05:30

స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు.

ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న మేయర్‌ భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పందన అర్జీల పరిష్కారానికి చర్యలు

మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

చిట్టినగర్‌, జూన్‌ 27 : స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.  నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలుగా మేయర్‌, కమిషనర్‌లకు అందజేశారు. మొత్తం 26అర్జీలు వచ్చాయి. సర్కిల్‌-2లో ఇంజనీరింగ్‌ విభాగం-1, యూసీడీ-1 సర్కిల్‌-3లో -1 అర్జీలు వచ్చాయి. సమస్యలను ఆయా విభాగాలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో త్వరితగతిన పరిష్కరించాలని మేయర్‌ అధికారులకు సూచించారు.  అదనపు కమిషనర్‌ ప్రాజెక్ట్‌ కె.వి. సత్యవతి, చీఫ్‌ మెడికల్‌ అఽపీసర్‌ ఇన్‌చార్జి బాబు శ్రీనివాసన్‌, సిటీ ప్లానర్‌ జి.వి.జిఎస్‌.వి.ప్రసాద్‌, డిప్యూటీ కమిషనర్‌(రెవెన్యూ) డి.వెంకట లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు

 పరిష్కరించండి 

కమిషనర్‌కు టీఎన్‌టీయూసీ వినతి

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కంచాలని కోరుతూ టీఎన్‌టీయుసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్పందనలో  కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ను టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పాల మాధవ్‌ పలువురు నాయకులతో కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్‌ మాట్లాడుతూ  నగరంలో రెండు నెలలుగా  కార్మికులకు జీతాలు అందక  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు సుంకర విష్ణు మాట్లాడుతూ కార్మిక సమస్యలు పరిష్కారమయ్యే వరకు కార్మికులకు అండగా ఉంటామన్నారు. పార్లమెంట్‌ కమిటీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తంగిరాల కొండ, కూచిపూడి దిలీప్‌, గొర్ల గోవింద్‌, ఎల్‌. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

వ్యాయామశాలలోని సమస్యలను పరిష్కరించండి

కృష్ణలంక భ్రమరాంబపురం వీఎంసీ వ్యాయామశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్‌ఐ నాయకులు సోమవారం నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు స్పందనలో వినతిపత్రం అందజేశారు. ఈ వ్యాయామశాల ఏర్పాటు చేసి 20 ఏళ్లు అయ్యిందని, నేడు ఎటువంటి సదుపాయాలు లేవని అధికారులు స్పందించి వ్యాయామశాలలో అన్ని సదుపాయాలు, పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పుప్పాల కృష్ణ, డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు జె.కొండా, బత్తుల ఉమామహేశ్వరరావు, నగర నాయకులు నోహిత్‌ కృష్ణ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-06-28T05:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising