Somu Veerraju: ‘విశాఖ గర్జన’ రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్ ప్రోగ్రాం
ABN, First Publish Date - 2022-10-18T02:40:59+05:30
Vijayawada: ‘విశాఖ గర్జన’ రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్ ప్రోగ్రాం అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వారి కార్యక్రమానికి జనాదరణ కరువవడంతో వైసీపీ నేతలకు దిక్కుతోచక జనసేనపై కుట్రకు తెరలేపారని ఆరోపించారు. విశాఖలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించి..పోలీసులు అధికార యంత్రాంగం చేతిలో కీలుబొమ్మలుగా మారానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. కేసులకు బెదిరేది లేదని.. న్యాయబద్ధంగా పోరాడతామని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన జనసేన, బీజీపీ నాయకుల సమావేశంలో సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Vijayawada: ‘విశాఖ గర్జన’ రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్ ప్రోగ్రాం అని బీజేపీ (BJP) ఏపీ అధ్యక్షుడు సోము (Somu Veerraju) వీర్రాజు విమర్శించారు. వారి కార్యక్రమానికి జనాదరణ కరువవడంతో వైసీపీ నేతలకు దిక్కుతోచక జనసేనపై కుట్రకు తెరలేపారని ఆరోపించారు. విశాఖలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించి..పోలీసులు అధికార యంత్రాంగం చేతిలో కీలుబొమ్మలుగా మారానని జనసేన పార్టీ (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫైరయ్యారు. కేసులకు బెదిరేది లేదని.. న్యాయబద్ధంగా పోరాడతామని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన జనసేన, బీజీపీ నాయకుల సమావేశంలో సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
’విజయనగరం నుంచి కుట్ర మొదలైంది’
‘‘విజయనగరంలో బీజేపీ కార్యకర్తలు నుంచి వైసీపీ దాడి ప్రారంభమైంది. ప్రతిపక్ష పార్టీలు నేతలను దాడులతో భయ పెడుతున్నారు. జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారు. నిన్నటి ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నాం. నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు. సన్నాసులు ఏదో వాగుతారు... వారి మాటలను పట్టించుకోనవసరంలేదు.’’ అని పవన్ పేర్కొన్నారు.
‘‘వైసీపీ దుశ్చర్యలను ఖండిస్తున్నాం’’
‘‘పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశం. జనసేనాధిపతిగా అనేక కార్యక్రమాలు, పర్యటనలు చేశారు. వారికి వారుగా వైసీపీ ఒక ఉద్యమం చేస్తుంది. వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేనపై కుట్ర పన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఇక్కడి పరిస్థితులను కేంద్ర పెద్దలకు కూడా వివరించాం. వారు కూడా వైసీపీ దుశ్చర్యలపై పోరాడాలని సూచించారు. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్ ప్రోగ్రాం. జన స్పందన లేక పోవడంతో కుట్రకు తెర లేపారు.’’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
Updated Date - 2022-10-18T02:40:59+05:30 IST