ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: నా భర్తను బలవంతంగా తీసుకువెళ్లారు: అంకబాబు సతీమణి

ABN, First Publish Date - 2022-09-23T18:44:21+05:30

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు (Senior Journalist Ankababu) అరెస్ట్‌ (Arrest)పై ఉత్కంఠ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు (Senior Journalist Ankababu) అరెస్ట్‌ (Arrest)పై ఉత్కంఠ కొనసాగుతోంది. తన భర్తకు సమాచారం ఇవ్వకుండా సీఐడీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని అంకబాబు సతీమణి విజయ (Vijaya) అన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని, బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని విజయ కోరారు. కాగా జర్నలిస్ట్ అంకబాబును విజయవాడలో గత రాత్రి అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. దీంతో టీడీపీ నేతలు వెలగపూడి గోపాలకృష్ణ, దేవినేని ఉమ, న్యాయవాదులు అంకబాబును పరామర్శించారు.


సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును గత రాత్రి ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌ (Whatsapp)లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్ పెట్టారని అంకబాబుపై అభియోగం... ఇటీవల ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత అంశంలో.. పోస్టింగ్ ఫార్వార్డ్ చేయడం వల్ల అంకబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంకబాబుపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని సీఐడీ పోలీసులు అభియోగం మోపుతూ ఐపీసీ 153(A), 505(2), రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-09-23T18:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising