ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాకంబరీ శరణు

ABN, First Publish Date - 2022-07-12T06:49:15+05:30

శాకంబరీ శరణు

ఆలయంలో కోలాటమాడుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు

ఆకుకూరలు, కూరగాయలతో నిండిపోయిన ఆలయ పరిసరాలు

భారీగా తరలివచ్చిన భక్తులు

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాక

క్యూలైన్లన్నీ కిటకిట


వన్‌టౌన్‌, జూలై 11 : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈవో భ్రమరాంబ పర్యవేక్షణలో ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు విఘ్నేశ్వర పూజ, రుత్విక వరుణ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు ప్రధాన ఆలయంలోని అమ్మవారు, ఉపాలయంలోని ఉత్సవమూర్తులను ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. శాకంబరీదేవిగా కొలువుతీరిన దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వర్షంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. భక్తులకు కదంబం (ఆకుకూరలు, కూరగాయలతో కలిపి చేసిన ప్రసాదం) పంపిణీ చేశారు. 

ఘాట్‌రోడ్డు మూసివేత

వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో సోమవారం ఘాట్‌రోడ్డు మూసివేశారు. దీంతో భక్తులు కనకదుర్గానగర్‌ నుంచి మహామండపం మెట్లమార్గం, లిఫ్టుల ద్వారా అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దీంతో లిఫ్టుల వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. 






Updated Date - 2022-07-12T06:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising