ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sailajanath: వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఎందుకు సందర్శించలేదు?

ABN, First Publish Date - 2022-07-19T18:21:12+05:30

గోదావరి వరద ముంపు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించామని శైలజానాథ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): గోదావరి (Godavari) వరద ముంపు ప్రాంతాలలో కాంగ్రెస్ (Congress) పార్టీ తరఫున సందర్శించామని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ (Sailajanath) తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ (CM Jagan) ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసమే పని చేస్తున్నారని, ప్రజల కోసం పని చేయటం లేదని విమర్శించారు. ఇది ప్రకృతి వైపరీత్యమని వైసీపీ మంత్రులు (YCP Ministers) చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్లాస్టిక్ డేరాల కింద జనాలు నివసిస్తున్నారని, ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి రూ. 25 వేలు, నిత్యవసర సరుకులను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.


కేంద్రం నుంచి పోలవరం నిధులు వస్తేనే పోలవరం పూర్తవుతుందని  రాష్ట్ర ప్రభుత్వం చెపుతుందని, పోలవరంలో ముంపు ప్రాంతాలలో తక్షణమే సహాయకచర్యలు చేపట్టాలని శైలజానాథ్ కోరారు. పరిహారం కింద జగన్మోహన్ రెడ్డి రూ. ఆరు లక్షల కాదు.. పది లక్షలు ఇస్తామన్నారని, తక్షణమే రూ. 10 లక్షలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21 తేదీన సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడం అన్యాయమన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా 21న  ధర్నా కార్యక్రమాలు చేపడతామన్నారు. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసులతో ఇబ్బంది పెట్టడం, అది రాజకీయ కక్షేనని, ఇటు వంటి రాజకీయ కక్షలకు పాల్పడేవారికి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదని శైలజానాథ్ అన్నారు.


Updated Date - 2022-07-19T18:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising