ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి

ABN, First Publish Date - 2022-12-13T01:29:17+05:30

ధాన్యం కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సోమవారం కానూరు సివిల్‌ సప్లై కార్యాలయం వద్ద సంఘా ల నేతృత్వంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన నాయకులు ఆశాఖ జనరల్‌ మేనేజరు శిరీషకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందిం చారు.

వరి రైతుల ఇబ్బందులపై ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనమలూరు, డిసెంబరు 12 : ధాన్యం కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సోమవారం కానూరు సివిల్‌ సప్లై కార్యాలయం వద్ద సంఘా ల నేతృత్వంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన నాయకులు ఆశాఖ జనరల్‌ మేనేజరు శిరీషకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందిం చారు. వినతిపత్రంలో రైతులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావిస్తూ రైతుల పక్షాన వారి వాదనను వినిపించారు. ఆర్బీకేల వద్ద తీసిన తేమశాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కావాలసినన్ని గోనె సంచులు అందు బాటులో ఉంచి, కాటా వేసిన ధాన్యా న్ని వెంటనే రవాణా చేసి మిల్లులకు పంపాలని కోరారు. ధాన్యం ఆరబెట్టడానికి, పైన కప్పడానికి పట్టలను ఉచితంగా సరఫరా చేయాలని, ధాన్యం తోలిన వారం రోజులలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని కోరారు. ఈ క్రాప్‌ను సడలించి కౌలు రైతుల ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఆందోళన కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు టీవీ లక్ష్మణ స్వామి, చనుమోలు సైదులు, బైరగాని శ్రీనివాసరావు, అన్నం నాగమల్లేశ్వరరావు, సాంబరెడ్డి, కే శివనాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ : మాండస్‌ తుఫాన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఆఫ్‌లైన్‌ ప్రక్రియలో తేమ శాతంతో సంబంధం లేకుండ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఎం బాపులపాడు మండల కార్యదర్శి బేత శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో భారీగా కోత విధించి రైతులను నష్టపెడుతున్నారన్నారు. ఆర్బీకే కేంద్రాలు పనితీరు కూడా బాగాలేదన్నారు. సాయంత్రం ఐదు గంటలు దాటితే సిబ్బంది అందుబాటులో ఉండక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ధాన్యం కొను గోలు పూర్తయ్యేవరకు ఆర్బీకే సిబ్బంది రైతులకు అందు బాటులో ఉండే విధం గా చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-12-13T01:29:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising