ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభజన హామీలు అమలు చేయాలి

ABN, First Publish Date - 2022-10-04T06:52:59+05:30

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా రాష్ట్రాన్ని మోసం చేస్తోందని సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు అన్నారు.

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

గవర్నర్‌పేట, అక్టోబరు 3 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా రాష్ట్రాన్ని మోసం చేస్తోందని సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, భారత విద్యార్థి ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఎంజీ రోడ్డులోని బాలోత్సవ్‌ భవన్‌లో విశాఖ రైల్వేజోన్‌, విభజన హామీల అమలుపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ అధ్యక్షత వహించగా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇటీవల ఢిల్లోలో జరిగిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సమావేశంలో బీజేపీ కపటనాటకం బయటపడిందన్నారు. విశాఖ రైల్వేజోన్‌ కుదరదని రైల్వే అధికారులు చెబుతున్నా ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమే అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ, విభజన హామీలు నెరవేర్చకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ గాయపర్చిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, వివిధ సంఘాల నేతలు ఎన్‌ లెనిన్‌బాబు, జాన్సన్‌, శివారెడ్డి, రవిచంద్ర, అనీల్‌, అండ్ర మాల్యాద్రి, వి.కృష్ణయ్య, ఆశ, డి.హరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-04T06:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising