రోడ్లపై గుంతలు పూడ్చిన గ్రామస్థులు
ABN, First Publish Date - 2022-10-17T06:23:59+05:30
రోడ్లపై గుంతలు పూడ్చిన గ్రామస్థులు
శాయిపురం(ఉయ్యూరు), అక్టోబరు 16 : గ్రామానికి వచ్చే రోడ్లతో పాటు, అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారై ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మా రోడ్లకు మరమ్మతులు చేయండి మహాప్రభో అని మొరపెట్టుకున్నా ఫలితం లేక పోవడంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాయిపురం సర్పంచ్ షేక్ జాన్‌బాషా, ఉప సర్పంచ్ జుజ్జువరపు బాబు ఆధ్వర్యంలో గ్రామస్థులు పలుగు, పారలు చేపట్టి ఆదివారం శ్రమదానం చేసి గోతులు బాగుచే సేందుకు ఉపక్రమించారు. విజయవాడ - మచిలీప్నం జాతీయరహదారి నుంచి మర్రివాడ మీదుగా, మరో వైపు ఉయ్యూరు, ఎగినపాడునుంచి గ్రామానికి వచ్చే రోడ్లలో పెద్ద గోతులు ఏర్పడి వర్షాలకు నీరు నిలిచి ద్విచక్రవాహనాలపై వస్తున్నవారు ప్రమా దానికి గురై గాయాలపాలవుతున్నారు. జుజ్జువరపు బాలయ్య, వి. జగన్మోహ నరావు, భూషయ్య, దాసరి కోటేశ్వరరావు తదితరులు శ్రమదానం చేశారు.
Updated Date - 2022-10-17T06:23:59+05:30 IST