ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు అండగా నిలవండి

ABN, First Publish Date - 2022-12-10T01:29:36+05:30

రైతులు పండించిన ధాన్యానానికి మద్దతు ధర లభిం చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబం ధిత అధికారులతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ అన్నారు. మండలం లోని కోలవెన్ను, పునాదిపాడు గ్రామాల్లో శుక్ర వారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యానికి మద్దతు ధర లభించే విధంగా ఆర్‌బీకేలు చర్యలు తీసుకో వాలన్నారు.

రైతులతో మాట్లాడుతున్న జేసీ అపరాజిత సింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంకిపాడు, డిసెంబరు 9 : రైతులు పండించిన ధాన్యానానికి మద్దతు ధర లభిం చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబం ధిత అధికారులతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ అన్నారు. మండలం లోని కోలవెన్ను, పునాదిపాడు గ్రామాల్లో శుక్ర వారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యానికి మద్దతు ధర లభించే విధంగా ఆర్‌బీకేలు చర్యలు తీసుకో వాలన్నారు. గన్నీ బ్యాక్స్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ టి.వి.సతీష్‌కు సూచించారు. రబీలో వరి పైరు వేసుకునేందుకు అనుమతులు కల్పిం చాలని కోలవెన్ను రైతులు జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ టి.వి.సతీష్‌, ఎవో పి.ఎం. కిరణ్‌, వ్యవసాయ మండలి చైర్మన్‌ చాట్ల విజయ్‌ బాబు, పునాదిపాడు, కోలవెన్ను సర్పం చులు ముసిబోయిన విజయ లక్ష్మి, సురేష్‌, రైతులు అధికారులు పాల్గొన్నారు.

పెనమలూరు : తుపాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం సేకరణ విషయం గురించి రైతులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని పెనమలూరు ఇన్‌చార్జి తహసీల్దార్‌ సతీష్‌ రైతులకు భరోసా ఇచ్చారు. ఆరబోసిన, బస్తాలకు ఎత్తిన ధాన్యం సేకరణ కోసం రెవెన్యూ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే 1265 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు.

తడవకుండా కాపాడాలి

విజయవాడ రూరల్‌ : నున్నలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశంలో ఏవో రంగనాధ్‌బాబు మాట్లా డు తూ, కళ్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా పలువురు రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో తేమశాతంలో కొంత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ మండలి చైర్మన్‌ యార్కారెడ్డి నాగిరెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

కొనుగోలు సరళతరం చేయాలి

కలవపాముల(ఉయ్యూరు) : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులనుంచి ధాన్యం కొనుగోల్లో నిబంధనలు సడలించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కౌలురైతు సంఘం అధ్యక్షుడు కె.శివ నాగేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాటూరు, కలవపాములలో రైతుభరోసా కేంద్రాలను శుక్రవారం సందర్శించి ధాన్యం కొనుగోలు వివరాలు సంబంధిత ఉద్యోగు లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిబంధనలు సడలించి కాటా వేసిన వెంటనే ధాన్యం మిల్లులకు రవాణా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు వినతిపత్రం అధికారులకు అందజేశారు. రైతు నాయకుడు అన్నే సుబ్బారావు, జాన్‌కోటయ్య, వెంకటే శ్వరరావు, చక్రధర్‌, రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:29:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising