ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర సమయోధుల త్యాగనిరతి ఆదర్శప్రాయం : రాంపిళ్ల

ABN, First Publish Date - 2022-08-10T06:31:08+05:30

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగనిరతి ఆదర్శ ప్రాయమని స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాంపిళ్ల జయప్రకాష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్టినగర్‌, ఆగస్టు 9 : దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగనిరతి ఆదర్శ ప్రాయమని స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాంపిళ్ల జయప్రకాష్‌ అన్నారు. ఆజాదీ కా అ మృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇండియన్‌ సివిలైజేషన్‌ గాంధీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మంగళవారం పాలఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న కొండపై స్వాతంత్య్ర పోరాటకాలంలో బ్రిటీష్‌ ప్రభుత్వంపై పోరాడేందుకు సర్దార్‌ రాంపిళ్ల సూర్యనారాయణ, నరసాయ మ్మ దంపతులు బాంబులు తయారు చేసిన ప్రదేశాన్ని ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్‌ క్యాడెట్లతో కలిసి జయప్రకాష్‌ సందర్శించారు. అక్కడ జాతీయ జెండాను ఎగురవేసి మా ట్లాడుతూ తన తండ్రి సర్దార్‌ రాంపిళ్ల సూర్యనారాయణ తదితర సమరయోధులు కొండపై భాగంలో రహస్యంగా బాంబులు తయారు చేశారన్నారు. అటుపై గాంధీ ప్రభావంతో గాంధీమార్గంలో పోరాటం చేశారన్నారు. తొలుత సయ్యద్‌ అప్పలస్వా మి కళాశాల ప్రాంగణంలోని గాంధీ దేవాలయంలో గాంధీ విగ్రహానికి రాంపిళ్ల జయప్రకాష్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దండా బత్తిన సరళ పాలాభిషేకం చేశారు. ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ ఆఫీసర్‌ చిన్నబాబు, ఎయిర్‌వింగ్‌ క్యాడెట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising