ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: ములాయం మరణం బాధాకరం..

ABN, First Publish Date - 2022-10-11T13:55:53+05:30

ములాయం సింగ్ యాదవ్ మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంతాపం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ (Ramakrishna) ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ములాయం 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలుపొంది ప్రజల మన్ననలు పొందారన్నారు. అట్టడుగు వర్గాల నాయకుడిగా పేరుగాంచి, బీసీల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. చివరి వరకు లౌకికవాదానికి ములాయం సింగ్ కట్టుబడి ఉన్నారని, సంకీర్ణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. దేశ రాజకీయ పరిణామాలు మారుతున్న కీలక దశలో ములాయం మరణం బాధాకరమని రామకృష్ణ పేర్కొన్నారు.


సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రి, అభిమానుల, పార్టీ శ్రేణుల ‘నేతాజీ’.. ములాయం సింగ్‌ యాదవ్‌ ఇకలేరు. ఎన్నికల బరిలో తిరుగులేని మల్ల యోధుడు, సంకీర్ణ రాజకీయాలను మలుపుతిప్పిన ‘కింగ్‌ మేకర్‌’... తన సుదీర్ఘ ప్రస్థానం ముగించారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయనను ఈ నెల రెండో తేదీన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే సోమవారం శాశ్వతంగా కన్నుమూసినట్టు ములాయం కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. విలీనాలు, విచ్ఛిన్నాలతో నిండిన ఒకప్పటి సంకీర్ణ అధికార రాజకీయాల్లో నెగ్గుకురావడమే కష్టం. అలాంటిది పదిసార్లు ఎమ్మెల్యే.. ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ములాయం అప్రతిహతంగా తన ప్రస్థానం కొనసాగించారు.

Updated Date - 2022-10-11T13:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising