ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం తగునా?...

ABN, First Publish Date - 2022-08-28T20:42:28+05:30

ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తగునా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తగునా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ (CPS) రద్దు కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ (Million March) కార్యక్రమం చేపట్టాయన్నారు. అయితే ఏపీ పోలీసులు (AP Police) వారంరోజుల ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముందస్తు నోటీసులు (Notice) జారీ చేయటం, పోలీస్ స్టేషన్లకు తరలించడం, వాహనాలను సీజ్ చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన ఉందా?.. లేక నియంత రాజ్యం కొనసాగుతోందా? అని ప్రశ్నించారు. కుప్పంలో విధ్వంసానికి తెరతీసిన వైసీపీ నిరసనలకు అనుమతి ఇచ్చిన పోలీసులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే శాంతియుత మిలియన్ మార్చ్‌కు ఎందుకు అనుమతి ఇవ్వరని నిలదీశారు. శాంతియుత ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్ర సరైంది కాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులపై సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రభుత్వ నిర్బంధ విధానాలు విడనాడాలన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సీపీఎస్ రద్దు కోసం చర్యలు చేపట్టాలని రామకృష్ణ సూచించారు.

Updated Date - 2022-08-28T20:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising