ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాయు‘గండం’

ABN, First Publish Date - 2022-11-21T23:37:23+05:30

వాతావరణంలో మార్పులు రైతులను వణికి స్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినవాయుగుండం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మబ్బులుకమ్మి తేలికపాటి వర్షం కురిసింది. రానున్న రెండు రోజులపాటు దక్షిణ కోస్తాతీరం వెంబడి ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రైతుల్లో అలజడి ప్రారంభమైంది. వరిపైరు కోతదశలో ఉన్న సమయంలో మరింతగా వర్షం పడితే పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడిపోతున్నారు. ఈపాటికే 20 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన రైతులు కోతలను నిలిపివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుపాను హెచ్చరికలతో అన్నదాతల్లో ఆందోళన

జిల్లాలో మరో రెండురోజుల పాటు వర్ష సూచన

20వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తి

మిగిలిన చోట్ల నిలిపివేత

వాతావరణంలో మార్పులు రైతులను వణికి స్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినవాయుగుండం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మబ్బులుకమ్మి తేలికపాటి వర్షం కురిసింది. రానున్న రెండు రోజులపాటు దక్షిణ కోస్తాతీరం వెంబడి ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రైతుల్లో అలజడి ప్రారంభమైంది. వరిపైరు కోతదశలో ఉన్న సమయంలో మరింతగా వర్షం పడితే పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడిపోతున్నారు. ఈపాటికే 20 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన రైతులు కోతలను నిలిపివేశారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 4.27 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. గతవారం రోజులుగా కంకిపాడు, గన్నవరం, పామర్రు, ఉయ్యూరు, పెడన, గుడ్లవల్లేరు, బంటుమిల్లి, గూడూరు, అవనిగడ్డ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ముందస్తుగా వరినాట్లు పూర్తి చేసిన పొలాల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 20వేల ఎకరాల్లో యంత్రాల ద్వారా వరికోతలు పూర్తిచేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా రెండు రోజులుగా రైతులు వరికోతలు నిలిపివేశారు. కొన్నిచోట్ల యంత్రాలతో వరికోతలు జరుగుతున్నాయి.

2,300 టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలో 4.27 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఈ ఏడాది 9.60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాగా ఉంది. జిల్లాలో 316 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 43 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్రమే తెరిచారు. సోమవారం నాటికి 2,300 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కంకిపాడు, ఉయ్యూరు, బంటుమిల్లి, పెనుమలూరు, ఉంగుటూరు, గుడివాడ, పామర్రు తదితర ప్రాంతాల్లో సోమవారం ధాన్యం కొనుగోళ్లను పౌరసరఫరాశాఖ జిల్లా మేనేజరు శ్రీధర్‌ పర్యవేక్షించారు. తెన్నేరు, కోలవెన్ను తదితర గ్రామాల్లో రైతులతో, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కంకిపాడు, ఉయ్యూరు తదితరప్రాంతాల్లో 18 లారీలను పంపి ధాన్యం మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు.

తీరు మారని ఆర్‌బీకే సిబ్బంది

ధాన్యం విక్రయించేందుకు రైతులు ఆర్‌బీకేలకు వెళితే 17 పాయింట్లు తేమశాతం వచ్చే వరకు ఆరబెట్టాలని సిబ్బంది రైతులకు చెప్పి పంపుతున్నారు. వర్షం కురుస్తుండటంతో ధాన్యం ఎలా ఆరబె ట్టాలని, రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై కలెక్టరేట్‌లో సోమవారం అధికారులు చర్చించుకోవడం కనిపించింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిబంధనలు ఎలా అమలు చేస్తున్నారని ఆర్‌బీకేలకు వెళ్లి సిబ్బందిని వివరాలు అడిగితే వారు సక్రమంగా సమాధానం చెప్పడం లేదని, మీకు శిక్షణ ఇచ్చారు కదా అని ప్రశ్నిస్తే సిబ్బంది మౌనంగా ఉండిపోతున్నారని అధికారులు చెప్పుకోవడం విశేషం.

మండలాల్లో ఇలా..

పామర్రు మండలంలో కోతకొచ్చిన వరి పంటను రైతులు, కౌలుదార్లు అందుబాటులో ఉన్న కూలీలతోపాటు యంత్రాలతో కోతలు కోయిస్తున్నారు. మండలంలో మొత్తం 24వేల ఎకరాలగాను ఇప్పటికే 2వేల ఎకరాల్లో నూర్పిళ్లు పూర్తయ్యాయి.

కూచిపూడి మండలంలో పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కొన్ని పొలాల్లో వరి పనలపై ఉండగా, మరికొన్ని పొలాల్లో కోతలకు సిద్ధంగా ఉంది.

తోట్లవల్లూరు మండలంలో ఐదు రోజులుగా అనేకచోట్ల వరి కోతలు పూర్తయి పనలు పొలంలో ఉన్నాయి. యంత్రాలతో కోసిన ధాన్యం రోడ్లవెంట ఆరబెట్టారు. ఈ తరుణంలో వాన రావటంతో ధాన్యాన్ని పోగుచేసి పరదాలు కప్పి జాగ్రత్త వహించారు.

Updated Date - 2022-11-21T23:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising