ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే బైపాస్‌ ట్రాక్‌ మార్గం మార్చండి

ABN, First Publish Date - 2022-07-02T06:38:23+05:30

రైల్వే బైపాస్‌ ట్రాక్‌ మార్గం మార్చండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ బాలశౌరికి విజయవాడ రూరల్‌ రైతుల వినతి

 విజయవాడ రూరల్‌, జూలై 1 : ముస్తాబాద నుంచి రాయనపాడు వరకు నిర్మించేందుకు తలపెట్టిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ (రైల్వే బైపాస్‌) మార్గాన్ని మార్చాలని విజయవాడ రూరల్‌ మండల రైతులు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరిని కోరారు. ఈ మేరకు  శుక్రవారం ఎంపీని రైతులు కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌పై భారం తగ్గించేందుకు ఆరులైన్ల బైపాస్‌కు ఉత్తరం వైపున రైల్వే కారిడార్‌ను నిర్మించేందుకు అధికారులు సర్వే పనులు చేపట్టారన్నారు. దీనివల్ల నున్నలో పేదలు ఇళ ్లను కోల్పోనుండగా, నున్న, పాతపాడు, కుందావారి కండ్రిక, సీతారామపురం గ్రామాలలో వేలాది ఎకరాల పంట పొలా ల మధ్య నుంచి ట్రాక్‌ వెళ్లనుందన్నారు. ఇప్ప టికే వేలాది ఎకరాల వ్యవసాయ భూములను పవర్‌గ్రిడ్‌, జాతీయ రహదారి, బైపాస్‌కు, పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చామని గుర్తు చేశారు.  రైల్వే ఉన్న తాధికారులతో చర్చించి, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో మండల వ్యవ సాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి, గొల్లపూడి ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోటేశ్వరరావు, సహకార సంఘాల అధ్య క్షుడు పోలారెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, నిడమానూరు సర్పంచ్‌లు శీలం రంగరావు, బట్టా సోమయ్య, గండికోట సీతయ్య, నాయకులు భీమవరపు ముత్తారెడ్డి, ఆర్‌వీఆర్‌  ఉన్నారు. 

Updated Date - 2022-07-02T06:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising