ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాధనం దుర్వినియోగం

ABN, First Publish Date - 2022-03-05T06:11:33+05:30

ప్రజాధనం దుర్వినియోగం

ఉయ్యూరు మూడవ వార్డులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న బోడె ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫప్రభుత్వ అనాలోచిత చర్యలపై   మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ విమర్శ

ఉయ్యూరు, మార్చి 4 : ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని   మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ విమర్శించారు. నియోజక వర్గంలో చేపట్టిన చంద్రన్న భరోసాయాత్రలో  భాగంగా శుక్రవారం ఉయ్యూరు పట్టణ 3వ వార్డులో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలతో  పాటు పేద వారికిచ్చే ఇళ్లపైన పార్టీ రంగులు పులుముతూ కోర్టు మొట్టికాయలతో మరో రంగు వేస్తూ ప్రజాధనం వృథా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 5కే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దుచేసి పేదవారి కడుపు కొట్టిం దని, చంద్రన్న బీమా, పెళ్లికానుక, రంజాన్‌తోఫా, క్రిస్మస్‌, సంక్రాతి కానుక వంటి సంక్షేమ పథకాలు నిలి పివేసి రద్దుల ప్రభుత్వంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ నిర్ణయా లను కోర్టులు తప్పుపడుతుంటే  ఈ కోర్టు కాకుంటే మరో కోర్టు అంటూ కోర్టుల చుట్టూ తిరుగు తూ పెద్దఎత్తున ప్రజల సొమ్ము వృథా చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారపక్ష నాయకులు ప్రజ ల ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణ పాఠం నేర్పుతారని హెచ్చరించారు. పార్టీ పట్టణ అధ్య క్షుడు  జంపాన గుర్నాధరావు, కౌన్సిలర్లు పండ్రాజు సుధారాణి, పలియాల శ్రీనివాసరావు, మాజీ చైర్మన్‌ ఖుద్ధూస్‌, ఈడే అంజిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising