ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవితంలో మార్పునకు ఫొటో నాంది

ABN, First Publish Date - 2022-08-20T06:13:10+05:30

జీవితంలో మార్పునకు ఫొటో నాంది

ఫొటో జర్నలిస్టులను సన్మానించిన కలెక్టర్‌ దిల్లీరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, ఆగస్టు 19: ఛాయాచిత్రం వేయి పదాల అర్థాన్ని ఇస్తుందని, జీవితంలో మార్పునకు ఫొటో నాంది పలుకుతుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ దినపత్రికల్లో పని చేస్తున్న ఫొటో జర్నలిస్టులను కలెక్టర్‌ సన్మానించారు. ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్‌ ఓఎం డ్యాగురే  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫొటో జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పథకాలపై ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించి ఉత్తమ ఛాయాచిత్రాలు తీసినవారికి ప్రశంసా పత్రం, నగదు ప్రోత్సాహ కాలను అందిస్తామన్నారు. ఫొటో జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంచేందుకు నిపుణులతో శిక్షణ అందిస్తామని, వారి సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేస్తానని  హామీ ఇచ్చారు. సమాచార, పౌర సంబంధాల జిల్లా అధికారి యు.సురేంద్రనాథ్‌, పౌర సంబంధాల జిల్లా అధికారి ఎస్వీ మోహనరావు, ఫొటో జర్నలిస్టులు సీహెచ్‌ విజయభాస్కర్‌, వైడీ ఆనంద్‌, రూబెన్‌ బెసాలియన్‌, సీహెచ్‌ నారాయణరావు, కేవీఎస్‌ గిరి, దుర్గాప్రసాద్‌, జీవీ నారాయణ, సీహెచ్‌వీ మస్తాన్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-20T06:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising