ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల భాషకు ప్రజలు సిగ్గు పడుతున్నారు..

ABN, First Publish Date - 2022-09-17T06:37:31+05:30

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వినియోగిస్తున్న భాషను చూసి తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నా రని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు.

నందిగామలో నిరసన ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ : వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వినియోగిస్తున్న భాషను చూసి తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నా రని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. చంద్రబాబు, నారా లోకేశ్‌, ఎమ్మెల్యే బాల వీరాంజనేయులుపై వైసీపీ ఎమ్మెలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  రోజా, కొడాలి నానిలు వాడుతున్న భాష వారి ఇళ్లలో వారు కూడా సమర్థించరన్నారు. టీడీపీ చేపట్టిన ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. 


పాదయాత్రను అడ్డుకుంటే బట్టలు ఊడదీసి కొడతారు 

గంపలగూడెం: ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అమరావతి రాజధాని పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న న్యాయమైన పాదయాత్రను అడ్డుకుంటే అధికార పార్టీ నాయకులను ప్రజలు బట్టలు ఊడదీసి కొడతారని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్‌ అన్నారు.  శుక్రవారం తోటమూల టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ మంత్రులు అప్పలరాజు, అమర్‌నాథ్‌, స్పీకర్‌ తమ్మినేనిలు రైతుల పాదయాత్రను అపహాస్యం చేస్తున్నారన్నారు.  హైకోర్టు తీర్పును కూడా గౌరవించలేని వైసీపీ మరో మారు మూడు ముక్కల నాటకాన్ని కొనసాగిస్తున్నారన్నారు.  సమావేశంలో దిరిశాల వెంకట కృష్ణారావు, రేగళ్ల వీరారెడ్డి, మందడపు కరుణాకర్‌, బూరుగు నారాయణ, తాళ్లూరి నాగేశ్వరరావు, పెదగమళ్ల బాబు పాల్గొన్నారు.  


Updated Date - 2022-09-17T06:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising