ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ పర్యటనను అడ్డుకోవడం హేయం

ABN, First Publish Date - 2022-10-17T06:24:57+05:30

పవన్‌ పర్యటనను అడ్డుకోవడం హేయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వన్‌టౌన్‌, అక్టోబరు 16 : విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనను అడ్డుకోవడం హేయమని జనసేన అధికార ప్రతినిధి, పార్టీ పశ్చిమ ఇన్‌చార్జి పోతిన వెంకట మహేష్‌ అన్నారు. విశాఖపట్నంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మహేష్‌ మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో పవన్‌ కల్యాణ్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు కుట్ర పన్నారన్నారు. విశాఖపట్నంలో గర్జన ముగిసిన తరువాత వైసీపీ మంత్రులు, నాయకులు విమానాశ్రయానికి వస్తుం డగా జనసేన నాయకులు దాడి చేశారనడంలో వాస్తవం లేదన్నారు. అందుకు రుజువులుంటే సీసీ ఫుటేజీని విడుదల చేయాలన్నారు. అక్కడి పోలీసు కమిషనర్‌ వైసీపీకీ అను కూలంగా వ్యవహరిస్తున్నారని చట్టం మేరకు విధులు నిర్వ ర్తించని ఆయనను సస్పెండ్‌ చేయాలన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను, కార్యకర్తలను బేషర తుగా విడుదల చేయాలన్నారు.  ప్రభుత్వానికి, జగన్‌ కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్ర మంలో పార్టీ నాయకులు ఎం విజయలక్ష్మి, పి అనిత, కే సోమనాధం, రావి సౌజన్య దోమకొండ మేరీ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T06:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising