ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: విశాఖ ఘటనపై వీడియో విడుదల చేసిన పవన్ కళ్యాణ్

ABN, First Publish Date - 2022-10-17T21:44:57+05:30

విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన సంఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వీడియో విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన సంఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సోమవారం వీడియో (Video) విడుదల చేశారు. 115 మంది జనసేన నాయకులపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టారని, కొంతమందికి స్టేషన్ బెయిల్ రాగా, 12మందిని రిమాండుకు పంపారన్నారు. రేపు (మంగళవారం) హైకోర్టులో పిటిషన్ వేసి  వారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తమ‌ పోరాటం వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ప్రజా వ్యతిరేక విధానాలపైనే అని స్పష్టం చేశారు. పోలీసులతో తమకు ఎటువంటి విబేధాలు లేవన్నారు. ఈ గొడవంతా ప్రభుత్వం వల్లేనని.. పోలీసుల నుంచి కాదన్నారు. తన కోసం వచ్చిన అభిమానులకు కూడా అభివాదం చేయకుండా అడ్డుకున్నారని, ప్రభుత్వం అడ్డంకుల వల్ల అభిమానులను కలవలేక పోయానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


కాగా విశాఖపట్నంలో పోలీసులు జనసేన నేతలు, కార్యకర్తలను అడ్డుకుని అక్రమ అరెస్టులు చేసి.. హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పయనమైయ్యారు. విశాఖలో ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటువంటి ఆంక్షలే భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో పవన్ చర్చలు జరపనున్నారు.

Updated Date - 2022-10-17T21:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising