ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలకు పంచే చిక్కీలో కూడా జగన్‌రెడ్డి కక్కుర్తి: పట్టాభి

ABN, First Publish Date - 2022-01-30T20:06:32+05:30

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో అనేక రకాల స్కామ్‌లు చూశామని, ఇసుక, మద్యం, మైనింగ్ ఇలా దేనిని వదిలిపెట్టలేదని ఆరోపించారు. ఆదివారం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు రాష్ట్రానికి సీఎం అయితే.. ఏ విధంగా దోచుకుంటారో జగన్‌రెడ్డి ప్రత్యేక్ష ఉదాహరణ అని అన్నారు. వివిధ స్కామ్‌ల ద్వారా వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డి... వారానికి మూడుసార్లు పిల్లలకు పంచే చిక్కీలో కూడా కక్కుర్తి పడ్డారని విమర్శించారు. 


చిక్కీ సరఫరాకు గతేడాది రూ.136 కోట్లు ఉన్న టెండర్‌ను.. ఈ ఏడాది అమాంతం రూ.198 కోట్లకు పెంచేశారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. అర్హతలేని కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారు. 60 శాతం కేంద్ర నిధులతో పీఎం పోషణ పథకాన్ని జగనన్న గోరుముద్దగా మార్చేశారన్నారు. జగన్‌రెడ్డి విద్యార్థుల పాలిట మేనమామ కాదు.. దొంగమామని వ్యాఖ్యానించారు. ఒకవైపు ఉద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు పప్పుచెక్కల్లో కూడా కోట్లు తినేస్తున్నారని పట్టాభిరామ్ విమర్శించారు. 

Updated Date - 2022-01-30T20:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising