ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తడిసిన ధాన్యానికి మొలకలు

ABN, First Publish Date - 2022-12-15T01:53:59+05:30

వర్షాలకు తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోపిదేవి, డిసెంబరు 14 : వర్షాలకు తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటను నేరుగా అమ్ముకునే హక్కును హరించి వేసి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం కారణంగానే ధాన్యం మొలకలు వచ్చిందని రైతులు వాపోతున్నారు. శివరామపురంలో కౌలు చేసుకునే నారగం సూర్యప్రకాశరావు అనే రైతు కనీసం ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు ఖాళీ ప్రదేశం లేక ప్రధాన రహదారిపై మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఇప్పటికైనా కొనుగోలు చేస్తారనే ఆశతో రెండు రోజులుగా ఎండబెడుతున్నారు. కౌలు ఏ విధంగా చెల్లించాలంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వెంకటాపురం, పెదకళ్లేపల్లి గ్రామాల్లోని సూర్యదేవర బాబురావు, దాసరి సత్యనారాయణలు మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఇదిగో వాహనాన్ని పంపిస్తామని రోజులు దాటవేశారే గానీ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని వాపోయారు. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా వరి, కూరగాయల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా మం డల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కోసూరు రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొక్కిలిగడ్డ, వెంకటాపురం, ఉత్తరచిరువోలులంక, కోసూరువారిపాలెం గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న కూరగాయలు, వరి పంటలను ఆయన పరిశీలించారు.దెబ్బతిన్న కూరగాయల పంటలను కంకిపాడు ఉద్యాన శాఖాధికారి చందు జోసఫ్‌ సుందరం పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు అందించారు.

Updated Date - 2022-12-15T01:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising