ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌సీల సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-07-02T06:23:04+05:30

సీఎం జగన్మోహనరెడ్డి పాలనలో ఎస్సీ ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ నిధులు నిర్వీర్య మయ్యాయని ఎన్‌టీఆర్‌ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, అధ్యక్షుడు విస్రం డానియేల్‌ అన్నారు.

జేసీకి వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్సీ సెల్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌సీల సమస్యలను పరిష్కరించాలి

  ఎన్‌టీఆర్‌ జిల్లా టీడీపీ ఎస్సీసెల్‌ నాయకులు

విద్యాధరపురం,జూలై 1: సీఎం జగన్మోహనరెడ్డి పాలనలో ఎస్సీ ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ నిధులు నిర్వీర్య మయ్యాయని ఎన్‌టీఆర్‌ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, అధ్యక్షుడు విస్రం డానియేల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఎస్సీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు, అనంతరం జేసీ  మోహనకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా వారిద్దరు మాట్లాడుతూ, చంద్రబాబు దళితులకు చేసిన మంచి పనులను, స్కీములను వివరిస్తూ, వాటినన్నిటినీ జగన్మోహనరెడ్డి నిర్వీర్యం చేశాడన్నారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ నిధులను మాల మాదిగ రెల్లి కార్పొరేషన్లకు కేటాయించాలన్నారు. లేకుంటే జగన్మోహనరెడ్డికి దళితులే చరమగీతం పాడతారన్నారు. మందా మురళి, బొద్దుకుల్ల ప్రేమరాజు, పరిశపోగు రాజేష్‌, సిరంశెట్టి నాగేంద్ర, ఎం ఎలియాబాబు, వనపట్ల డేవిడ్‌రాజు, కె. విక్టోరియా, కొట్టేటి సరిత, ఎం. రాజు, దోమకొండ రవికుమార్‌, కొత్తపల్లి  ప్రకాష్‌, దేవరపల్లి ఆంజనేయులు, మారంపూడి కుమార్‌, సిరికొండ ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-02T06:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising