చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు
ABN, First Publish Date - 2022-12-16T00:06:02+05:30
భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాటం సాగించిన చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు అని పలువురు వక్తలు కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం పలుచోట్ల ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల వారు ఘన నివాళులు అర్పించారు.
అమరజీవి వర్థంతికి పలువురి నివాళి
భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాటం సాగించిన చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు అని పలువురు వక్తలు కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం పలుచోట్ల ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల వారు ఘన నివాళులు అర్పించారు.
వన్‌టౌన్, డిసెంబరు 15 : పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు శ్రీరాములు చిత్రపటానికి ఘన నివాళులు సమర్పించారు.
మహాత్మాగాంధీ హోల్‌సేల్ మార్కెట్ వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి కాంప్లెక్స్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు.
సామారంగం చౌక్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి ఫౌండేషన్ ప్రతినిధులు నివాళులు అర్పించారు.
అజిత్‌సింగ్‌నగర్ : అజిత్‌సింగ్‌నగర్ గుజ్జల సరళాదేవి కల్యాణ మండపంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ, స్థానిక కార్పొరేటర్ షాహీనా సుల్తానాలు నివాళులు అర్పించారు.
గవర్నర్‌పేట : ఏపీసీసీ, సిటీ కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ వర్థంతి కార్యక్రమాలు ఆంధ్రరత్న భవన్లో నిర్వహించారు. దివంగత నేతల చిత్రపటాలకు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బందరు రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో పలువురు నివాళి అర్పించారు.
సత్యనారాయణపురం : 33వ డివిజన్లో టీడీపీ ఇన్చార్జ్ గార్లపాటి విజయకుమార్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమం జరిగింది. తోలుత పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంచారు. సత్యనారాయణపురం చిత్తరంజన్ శాఖా గ్రంథాలయంలోనూ వర్థంతి నిర్వహించారు.
కృష్ణలంక : నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల ఆవరణలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి కృష్ణలంక వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిమ్మల దుర్గారావు పూలమాల వేసి నివాళులర్పించారు.
గుణదల : నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ మేకా సత్తిబాబు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
Updated Date - 2022-12-16T00:06:04+05:30 IST