ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణంలో జాప్యం.. ప్రజలకు నరకం

ABN, First Publish Date - 2022-11-19T00:44:37+05:30

తెల్లవారు మొదలు నిత్యం వేల సంఖ్యలో ప్రజలు, వేల సంఖ్యలో వాహనాలు తిరిగే అత్యంత ప్రాముఖ్యత కలిగిన కానూరు ఆటోనగర్‌ రోడ్డు నిర్మాణంలో జాప్యంతో ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. కానూరు ప్రాం తాన్ని ఆటోనగర్‌ ద్వారా ఏలూరు రోడ్డును, ఇతర ప్రాంతాలను అనుసంధానించే ఈ రోడ్డుపై లేచే దుమ్ముధూళితో ప్రయాణం అంటేనే జనం హడలి పోతున్నారు. పాదచారులు, మోటారు సైకిల్‌పై ప్రయాణం సాగించే వారికి ఈ రోడ్డుపై మాస్కు ధరించడం మామూలయింది. ఈ రోడ్డుపై మినీ వాహనాలే కాకుం డా భారీ వాహనాలు, అతి భారీ వాహనాలు రాకపోకలు సాగించడం సమస్యను మరింత జటిలం చేస్తోంది.

రోడ్డుపై నిత్యం రేగే దుమ్ము,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనమలూరు, నవంబరు 18 : తెల్లవారు మొదలు నిత్యం వేల సంఖ్యలో ప్రజలు, వేల సంఖ్యలో వాహనాలు తిరిగే అత్యంత ప్రాముఖ్యత కలిగిన కానూరు ఆటోనగర్‌ రోడ్డు నిర్మాణంలో జాప్యంతో ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. కానూరు ప్రాం తాన్ని ఆటోనగర్‌ ద్వారా ఏలూరు రోడ్డును, ఇతర ప్రాంతాలను అనుసంధానించే ఈ రోడ్డుపై లేచే దుమ్ముధూళితో ప్రయాణం అంటేనే జనం హడలి పోతున్నారు. పాదచారులు, మోటారు సైకిల్‌పై ప్రయాణం సాగించే వారికి ఈ రోడ్డుపై మాస్కు ధరించడం మామూలయింది. ఈ రోడ్డుపై మినీ వాహనాలే కాకుం డా భారీ వాహనాలు, అతి భారీ వాహనాలు రాకపోకలు సాగించడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ బీటీ రోడ్డును నిర్మించడానికి గత జులైలో కోటీ ఇరవై లక్షల వ్యయ అంచనాతో స్థానిక ఎమ్మెల్యే కె. పార్థసారథి శంకుస్థాపన చేశారు. మునిసిపల్‌ సాధారణ నిధులు కొన్ని, 15వ ఆర్ధిక సంఘం నిధులు వెచ్చించి నిర్మించడం ప్రారంభించారు. అయితే కాంట్రాక్టరు పనుల్లో తీవ్ర జాప్యం చేస్తుండడంతో కొద్ది రోజుల్లోనే పూర్తి కావాల్సిన తారు రోడ్డు దుమ్ముతో నిండిపోతోంది. ఈ రోడ్డుపై లేచే దుమ్ముతో విసుగు చెందిన కొంత మంది వ్యాపారులు తమ షాపులను మూసివేసి వెళ్లిపోవడమో లేదంటే షట్టరు వేసుకొని లోలోపలే పనులు చక్కబెట్టుకోవడమో చేస్తున్నారు. కొద్ది మంది షాపు యజమానులు తమ షాపుల ముందు దుమ్ము లేవకుండా నిత్యం నీళ్లు చల్లుకుంటున్నారు. ఈ రోడ్డుపై తిరిగే ప్రయాణికులు కనీసం టీ టిఫిన్‌కు కూడా ఆగే అవకాశం లేకపోవడంతో చాలామంది హోటల్‌ నిర్వాహకులు హోటళ్లను వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు రోడ్డుపై లేచే దుమ్ముతో దుమ్ముకొట్టుకు పోయిన వైనం మనకు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చెబుతాయి. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేసి ఈ నరకం నుండి తమను విముక్తులను చేయాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-11-19T00:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising