విద్యార్థులను ఇబ్బందిపెడితే సహించం
ABN, First Publish Date - 2022-08-04T07:09:47+05:30
విద్యార్థులను ఇబ్బందిపెడితే సహించం
దావాజీగూడెం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులకు డీఈవో హెచ్చరిక
గన్నవరం, ఆగస్టు 3: విద్యార్థులను ఇబ్బంది పెడితే సహిం చేది లేదని దావాజీగూడెం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులను డీఈవో తాహెరా సుల్తానా హెచ్చరించారు. ఎంపీపీ పాఠశాలలో 3,4,5 తరగతులను జడ్పీ హైస్కూల్‌లో విలీనం చేసి, సరైన వసతులు కల్పించలేదంటూ ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైన స్టోర్ రూంలో విద్యా బోధన, మా బడికి పంపేయండి కథనాలపై విద్యా శాఖ స్పందించింది. హైస్కూల్‌కు బుధవారం వచ్చిన డీఈవో తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ‘‘తరగతి గదులు ఉన్నా విద్యార్థులను ఎందుకు బయట కూర్చోబెట్టారు? తరగతి గదుల్లో మెటీరియల్ పెట్టడం ఏంటి? విద్యార్థులకు వాంతులు ఎందుకు అయ్యాయి?’’ అని డీఈవో నిలదీశారు. ఇలాంటివి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తరగతి గదులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదే శించారు. ఎంపీపీ పాఠశాల విలీనమైతే విద్యార్థులకు అవసరమైన గదులు కేటాయించకపోవటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం నిర్వహణ సక్రమంగా లేదన్నారు. ఉపాధ్యాయుల డైరీ, లెసన్ ప్లానింగ్ పరిశీ లించారు. 3,4,5 తరగతుల విద్యార్ధులకు తరగతి గదులను కేటాయించారు. ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేశారు. ఎంఈవో వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం ఆర్.విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T07:09:47+05:30 IST