ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్గంసుగమం

ABN, First Publish Date - 2022-05-30T05:44:26+05:30

మార్గంసుగమం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో 47 రోడ్ల అభివృద్ధికి టెండర్లు 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్‌ జిల్లాలో అగ్రికల్చర్‌ అండ్‌ కో ఆపరేషన్‌ (మార్కెటింగ్‌-2) విభాగం ద్వారా రూరల్‌ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజక వర్గాల పరిధిలో మొత్తం 47 రోడ్లకు సంబంధించి 164.29 కిలోమీటర్ల మేర కొత్తగా బీటీతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే, 85.31 కిలోమీటర్ల మేర ఆయా నియోజకవర్గాల్లోని రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. మొత్తంగా 47 రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనుల కోసం రూ.18.35 కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో మొత్తం 10 రోడ్లను 35 కిలోమీటర్ల మేర రూ.4.80 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. నందిగామలో 15 రోడ్లను 49.50 కిలోమీటర్ల మేర రూ.5.1 కోట్లతో, తిరువూరులో 16 రోడ్లను 56.16 కిలోమీటర్ల మేర రూ.6 కోట్లతో, మైలవరంలో మొత్తం 6 రోడ్లను 23.63 కిలోమీటర్ల మేర రూ.2.54 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులన్నింటికీ జిల్లా యంత్రాంగం టెండర్లు పిలిచింది. అలాగే, జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో 22.30 కిలోమీటర్లు, నందిగామలో 24.72 కిలోమీటర్లు, తిరువూరులో 24.86 కిలోమీటర్లు, మైలవరంలో 13.43 కిలోమీటర్ల చొప్పున రోడ్లకు మరమ్మతులు నిర్వహించనున్నారు. త్వరలో టెండర్లను ఖరారు చేయటం ద్వారా ఒకేసారి అన్ని పనులు మొదలు పెట్టనున్నారు.

Updated Date - 2022-05-30T05:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising