ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల గోడు

ABN, First Publish Date - 2022-08-11T07:39:50+05:30

జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారుల అలసత్వం రైతులకు శాపంగా మారింది. నందివాడ మండల పరిధిలో నందివాడ నుంచి పోలుకొండ వరకు సుమారు 11.2 కి.మీ ప్రవహించే నెహ్రల్లీ డ్రెయిన్‌ పూడికతీత పనులను గత ఏడాది రూ.14 లక్ష లకు తీసుకున్న గుత్తేదారు పనులు చేపట్టక పోవడంతో రైతులకు తీరని క్షోభ మిగిల్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుత్తేదారు నిర్లక్ష్యం

పూడికతీతకు నోచుకోని నెహ్రల్లీ డ్రెయిన్‌

రూ.14 లక్షలు అప్పనంగాకొట్టేసే యత్నం 

 గుడివాడ, ఆగస్టు 10 :  జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారుల అలసత్వం రైతులకు శాపంగా మారింది. నందివాడ మండల పరిధిలో నందివాడ నుంచి పోలుకొండ వరకు సుమారు 11.2 కి.మీ ప్రవహించే  నెహ్రల్లీ డ్రెయిన్‌ పూడికతీత పనులను గత ఏడాది రూ.14 లక్ష లకు తీసుకున్న గుత్తేదారు పనులు చేపట్టక పోవడంతో రైతులకు తీరని క్షోభ మిగిల్చింది. మురుగు వెనక్కి వచ్చి పంటపొలాలు, చేపల చెరువులకు నష్టం చేస్తోంది. సరైన సమయంలో టెండర్లు పిలవక పోవడంతో నీళ్లు వచ్చిన తర్వాత పనులు చేపట్టడం వీలు కావడం లేదని గుత్తేదారులు పేర్కొం టున్నారు. తూడు నిర్మూలనకు రసాయనాలు చల్లించకపోవడం అధికారుల పనితీరును తేటతెల్లం చేస్తోంది. ప్రస్తుతం గత ఏడాది నిర్వహణ బాధ్యతలు తీసుకున్న గుత్తేదారు అప్పనంగా రూ.14 లక్షలు మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తుండటం విశేషం. పనులు చేయకుండా ఎలా నిధులు మంజూరు చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుం టున్నారు. ప్రస్తుత ఇరిగేషన్‌ సంవత్సరంలో మరో కాంట్రాక్టర్‌ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. కాంట్రాక్ట్‌ గడువు మొదలై రెండు నెలలు కా వస్తున్నా నేటికీ పనులు మొదలు పెట్టకపోవడంతో నెహ్రల్లీ డ్రెయిన్‌ తూడు, పిచ్చి  చెట్లతో భయానకంగా దర్శనమిస్తోంది. దీనిపై ఏఈ జయదీప్‌ను వివరణ కోరగా పనులు చేపట్టని కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేది లేదని స్పష్టం చేశారు.  

Updated Date - 2022-08-11T07:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising