ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సరీలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి

ABN, First Publish Date - 2022-01-29T06:44:40+05:30

నర్సరీలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి

నర్సరీ నిర్వాహకుడికి నోటీసు అందజేస్తున్న ఉద్యాన శాఖాధికారి లక్‌పతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనమలూరు, జనవరి 28 : మండలంలో పండ్లు, కూరగాయలు, పూలు తదితర నర్సరీలు నిర్వహించే వారు 2010 నర్సరీ చట్ట ప్రకారం తప్పని సరిగా రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలని కంకిపాడు ఉద్యాన శాఖాధికారి జి. లక్‌పతి అన్నారు. 

ఈ మేరకు శుక్రవారం గంగూరు, గోసాల గ్రామాల్లో ఉన్న కొన్ని నర్సరీలకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా లక్‌పతి మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన మొక్కలను అందిం చేందుకు ఏపీ ఉద్యాన నర్సరీల చట్ట నిబంధనలకు లోబడి లైసెన్సులను జారీ చేస్తునట్లు తెలిపారు. లైసెన్సు పొందడానికి నర్సరీ స్థల పత్రాలు, ఆధార్‌కార్డు, ఫారమ్‌ - ఏ, దరఖాస్తుతో పాటు రూ. వెయ్యి చలానా చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలన్నారు. లైసెన్సు లేకుండా నర్సరీలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లక్‌పతి హెచ్చరించారు.

Updated Date - 2022-01-29T06:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising