ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ, జగన్‌ ప్రజలపై భారం మోపుతున్నారు: నారాయణ

ABN, First Publish Date - 2022-04-05T17:12:41+05:30

మోదీ, జగన్ ప్రజలపై భారం మోపుతున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్‌ ప్రజలపై భారం మోపుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు జగన్ కరెంట్ షాక్ ఇచ్చారన్నారు. పోలవరం విషయంలో మోదీ, జగన్‌ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఈనెల 19న ఛలో పోలవరం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.


జిల్లాల పునర్విభజన ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని నారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపలేదని, జిల్లాల ఏర్పాటు జగన్ సొంత వ్యవహారం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మంత్రి పేర్నినాని విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా... అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? అన్నారు. పేర్నినాని ఇకనైనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. జగన్ పాలనపై వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయని నారాయణ స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-05T17:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising