ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరుకే ఆరోగ్య కేంద్రాలు

ABN, First Publish Date - 2022-08-04T07:06:13+05:30

పేరుకే ఆరోగ్య కేంద్రాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పరికరాలు అంతంతమాత్రం.. వేధిస్తున్న సిబ్బంది కొరత

 రక్త పరీక్షలూ నామమాత్రమే.. పరిమిత సేవలతోనే నెట్టుకొస్తున్న సిబ్బంది 

గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలకు సకాలంలో ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలు మొక్కుబడిగా పనిచేస్తున్నాయి.  సీజనల్‌ వ్యాధులు, మలేరియా, డెంగీ జ్వరాలతో ప్రజలు సత మతమవుతుంటే ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని పరికరాలు లేక నామ మాత్రపు వైద్య పరీక్షలు చేస్తున్నారు. సిబ్బంది కొరతతో సరైన సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. 

తన కుమార్తె ఐదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో క్రీస్తురాజపురానికి చెందిన వ్యక్తి మెడికల్‌ షాపులోని మందులు వాడారు. తగ్గకపోవడంతో దగ్గర్లోని యూపీహెచ్‌సీకి వెళ్లారు. డాక్టర్‌ జీజీహెచ్‌కు వెళ్లి కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇతర రక్త పరీక్షలు ఇక్కడే నిర్వహించాలని  తండ్రి కోరితే ల్యాబ్‌ టెక్నీషియన్‌ వారంలో మూడు రోజులు కృష్ణలంక సెంటర్‌లో, మరో మూడు రోజులు ఇక్కడ ఉంటారని స్టాఫ్‌ నర్సు చెప్పారు.  పూర్తి స్థాయి లో రక్త పరీక్షలు ఇక్కడ చేయరని, జీజీహెచ్‌కు వెళ్లాలని సూచించారు.

 వాంబేకాలనీకి చెందిన వ్యక్తి మధుమేహంతో బాధుపడుతున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్తే మధుమేహ పరీక్షలతోపాటు కొన్ని సందర్భాల్లో ఇతర పరీక్షలు రాస్తున్నారు. వాటి కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళితే రోజంతా వెచ్చించాల్సి వస్తోందని ఆయన వాపోయారు. పరీక్ష ఫలితాలు కూడా వెంటనే రావడం లేదని చెప్పారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎన్టీఆర్‌ జిల్లాలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు 40 ..గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 ఉన్నాయి. గతే డాది రాష్ట్ర ప్రభుత్వం అపోలోతో చేసుకున్న ఒప్పందం ముగియడంతో ఆ సంస్థకు చెందిన పరికరాలతో సిబ్బంది తరలివెళ్లిపోయారు. దీంతో ఆరోగ్య కేంద్రాల్లో పరికరాలు అందు బాటులో లేకుండా పోయాయి. దీంతో ఆరోగ్య కేంద్రాలు బీపీ, షుగర్‌, హెచ్‌బీ, ఆర్‌బీఎస్‌ రక్త పరీక్షలకే పరిమితమయ్యాయి. అపోలో సంస్థ ఆధీనంలో ఉన్నప్పుడు రోజుకు 60కు పైగా ఓపీ లు ఉండేవి. ప్రస్తుతం రోజుకు 10 ఓపీలు రావ డం లేదని సిబ్బంది చెబుతున్నారు. పరికరాలు, పరీక్షలు, మందుల కొరతతో ఇక్కడికి వచ్చే రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆరోగ్య కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 

వేధిస్తున్న సిబ్బంది కొరత

పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ కేంద్రాల్లో సిబ్బంది కొరత వేఽధిస్తోంది. ఒక్కో ల్యాబ్‌ టెక్నీషియన్‌ రెండు ఆరోగ్యకేంద్రాల్లో విఽధులు నిర్వ హిస్తున్నారు. దీంతో ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేని రోజుల్లో వచ్చే రోగులను మరల రావాలని వెనక్కి పంపించేస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరతతో ఆరోగ్య కేంద్రాల్లో నామ మాత్రపు సేవలకు పరిమితం కావడంతో రోగులు పెద్రాసుపత్రులుకు వెళ్లాల్సి వస్తోంది. 

పెద్దాసుపత్రులకు వెళ్లండి

జిల్లాలో అన్ని చోట్ల రక్తం, మూత్ర, కళ్లె, జ్వర నిర్ధారణ పరీక్షలు ఆపివేయడం..ల్యాబ్‌ పరి కరాలు తరలించడంతో సేవలు అందడం లేదు. దీంతో సిబ్బంది దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సలహాలిస్తున్నారు. సాఽధారణ మం దులే అందుబాటులో ఉన్నాయని, దీర్ఘకా లిక మందులకు పెద్దాసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు. గ్రామీణ, పట్ట ణ ఆరోగ్య కేంద్రాల్లో చాలచోట్ల కుక్క, పాము కాటు మందులు తగినన్ని లేవని సమాచారం. వాటికోసం సమీపంలోని పెద్దాసుపత్రికి వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు.  



Updated Date - 2022-08-04T07:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising