ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లింలకు తీరని ద్రోహం చేసిన జగన్‌

ABN, First Publish Date - 2022-06-20T07:01:35+05:30

ముస్లింలకు తీరని ద్రోహం చేసిన జగన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అజిత్‌సింగ్‌నగర్‌, జూన్‌ 19 : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు తీరని ద్రోహం చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సింగ్‌నగర్‌లోని షాధీఖానాలో సెంట్రల్‌ నియోజకవర్గ మైనారిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీలు ఎక్కువగా పేదరికంలో జీవిస్తున్నారన్నారు. అలాంటి ముస్లిం లు స్వయంగా ఎదిగేందుకు ఉపయోగపడే పథకాలన్నీ జగన్‌ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.  బడ్జెట్‌ అంకెల్లో కేటాయింపులు చూపించి రంజాన్‌ తోఫా, దుల్హన్‌, విదేశీ విద్య, ఇస్లామిక్‌ బ్యాంక్‌, స్వయం ఉపాధి యూనిట్లకు  పూర్తిగా మంగళం పాడారని దుయ్యబట్టారు. మళ్లీ ముస్లింలకు మంచి రోజులు రావాలంటే చంద్ర బాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అనంతరం సెంట్రల్‌ నియో జకవర్గ మైనారిటీ అధ్యక్షుడిగా షేక్‌  అన్వర్‌ బాషా, ప్రధాన కార్యదర్శిగా బాషా, 120 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎరుబోతు రమణారావు, గరిమెళ్ల చిన్నా, జాన్‌వలి, దాసరి దుర్గారావు, కరీముల్లా, మోత్కూరి ఖాశీం, షఫీ, షేక్‌ సలీం, షేక్‌ బాజీ, దాసరి ఉదయశ్రీ, లబ్బా దుర్గ, బెజ్జం జైపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-20T07:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising