ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నా.. అని పిలిచి.. కత్తితో పొడిచాడు..

ABN, First Publish Date - 2022-10-17T06:16:30+05:30

అన్నా.. అని పిలిచి.. కత్తితో పొడిచాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచికచర్లలో దారుణ హత్య

కంచికచర్ల రూరల్‌, అక్టోబరు 16 : ఆదివారం రాత్రి 11 గంటలు.. ఓ వ్యక్తి ఇంటి ముందుకొచ్చి అన్నా.. అని పిలిచాడు. తెలిసిన వ్యక్తే.. పైగా తమ గ్రామానికి చెందినవాడేననే చనువుతో లోపలున్న మరో వ్యక్తి బయటకొచ్చాడు. చనువుగా ఏంటి తమ్ముడు అనేలోపే.. బయట నిలబడిన వ్యక్తి ఒక్కసారిగా గుండెలోకి కత్తిని దింపాడు. అసలేం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకునేలోపే లోపలి నుంచి వచ్చిన వ్యక్తి ఊపిరి ఆగిపోయింది. సినీ ఫక్కీలో క్షణాల్లో జరిగిపోయిన ఈ హత్య కంచికచర్లలో ఆదివారం రాత్రి సంచలనం సృష్టించింది. స్థానిక గొట్టిముక్కల రోడ్డులో నివాసం ఉంటున్న చల్లకంటి నాగరాజు(35)ను అదే గ్రామానికి చెందిన జోజి అనే యువకుడు ఇలా కత్తిని గుండెలో దింపి చంపాడు. ఇంటి వద్దకు వచ్చి నాగరాజును పిలవడంతో.. రోజూ ఇంటికి వస్తున్న అతనే కదా.. అని బయటకు వచ్చి పలకరించాడు. ఒక్కసారిగా దాడి జరగడంతో నిర్ఘాంతపోయి ప్రాణాలు వదిలాడు. అనంతరం జోజి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎస్సై సుబ్రహ్మణ్యం సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు దారితీసిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Updated Date - 2022-10-17T06:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising