ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న వైసీపీ

ABN, First Publish Date - 2022-09-10T06:35:15+05:30

పేదలకు అన్నపెట్టి కడుపు నింపాలని టీడీపీ చూ స్తుంటే ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేసి తప్పించుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, దానికనుగుణంగానే పోలీసులు వ్యవహరిస్తూ చట్టాన్ని వైసీపీకి చుట్టంగా మార్చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ 

పటమట, సెప్టెంబరు 9 : పేదలకు అన్నపెట్టి కడుపు నింపాలని టీడీపీ చూ స్తుంటే ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేసి తప్పించుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, దానికనుగుణంగానే పోలీసులు వ్యవహరిస్తూ చట్టాన్ని వైసీపీకి చుట్టంగా మార్చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. 12వ డివిజన్‌ సంజయ్‌ గాంఽధీ కాలనీలో ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా మొబైల్‌ అన్న క్యాం టీన్‌ ఏర్పాటు చేసి అన్నదానం ప్రారంభించి సుమారు 300 మందికి అన్నదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌ మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌ పేరుతో చంద్రబాబు లక్షలాది మందికి అన్నం పెడితే వారి పొట్టకొట్టిన వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డి అని ధ్వజమెత్తారు. చెన్నుపాటి గాంధీపై హత్యాయత్నం జరిగితే ముద్దాయిలపై హత్యాయత్నం కేసు నమోదు చేయలేదన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే గాంధీ కేసులో వైసీపీ అండ చూసుకుని ముద్దాయిలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు. కార్పొరేటర్‌ పొట్లూరి సాయిబాబు, డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు శాయన సత్యనారాయణ, చెన్నుపాటి ఉషారాణి, అబ్దుల్‌ ఖాలిక్‌, జక్కుల సుబ్బారావు, పఠాన్‌ హయాత్‌ఖాన్‌, మేదరమెట్ల నారాయణ, మాదల చిన్నత్లిలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-10T06:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising