ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-01-25T06:40:06+05:30

సమస్యలు పరిష్కరించాలి

నూజివీడు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మహధర్నాలో పాల్గొన్న వంట ఏజెన్సీ నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు టౌన్‌, జనవరి 24: పాఠశాల కార్మికులకు జాతీయ లేబర్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పశ్చిమ కృష్ణ కార్యదర్శి దుర్గం పుల్లారావు డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, వంట ఏజెన్సీ హెల్పర్లు, పాఠశాల పారిశుధ్య కార్మికులు సోమవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. వంట ఏజెన్సీ కార్మికులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించడం దారుణమని పుల్లారావు అన్నారు. కార్మిక చట్టాలను అనుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కనీసం వేతనం రూ.21 వేలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వేముల బక్కయ్య, ప్రగతీశీల మహిళా సంఘం అధ్యక్షురాలు తామాడ అరుణ, పరికల కళావతి, బిగూది ఆనందరావు, తనగాల మాలతి, విజయ, మేడ కామేశ్వరి, దాసు, బూతం మారయ్య పాల్గొన్నారు.


Updated Date - 2022-01-25T06:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising