మంత్రి ధర్మాన భూ దోపిడీలపై విచారణ చేపట్టాలి : టీడీపీ
ABN, First Publish Date - 2022-10-17T06:27:07+05:30
మంత్రి ధర్మాన భూ దోపిడీలపై విచారణ చేపట్టాలి : టీడీపీ
విద్యాధరపురం, అక్టోబరు 16 : భూ దోపిడీలకు పాల్పడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం మొగల్రాజపురంలోని కేశినేని శివనాధ్ (చిన్ని) కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైనికోద్యోగుల భూములను దొంగ పత్రాలను సృష్టించి కబ్జా చేసిన మంత్రి అతని కుటుంబ సభ్యులపె విచారణ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎండీ ఇర్ఫాన్, జే కొండలరావు, శ్రీనివాస్ శర్మ, బెనర్జీ, సరోజిని శ్రీను పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T06:27:07+05:30 IST