ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్రాంతికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఫిజిషియన్‌: కృష్ణబాబు

ABN, First Publish Date - 2022-08-19T01:49:08+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానాన్ని సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానాన్ని సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ పేదలకు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. సెప్టెంబరు మొదటి వారంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 10,032 వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశామన్నారు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఏఎన్‌ఎం, ముగ్గురు ఆశా వర్కర్లు ఈ కేంద్రాల్లో సేవలందిస్తారని చెప్పారు. ఇప్పటికే 8,500 మంది ఎంఎల్‌హెచ్‌పీలను నియమించామని, మరో 1,500 మంది నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేశామని తెలిపారు. కొన్ని గ్రామాలలో 1500 క్లినిక్‌లకు సొంత భవనాలు వున్నాయని, మరో 8,500 భవనాలు నిర్మాణ దశలో వున్నాయని చెప్పారు. వీటిలో రెండు వేల భవనాల నిర్మాణం పూర్తయిందని, మరో మూడు వేల భవనాలు తుది మెరుగులు దిద్దుకునే దశలో వున్నాయని కృష్ణబాబు వివరించారు.


Updated Date - 2022-08-19T01:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising