ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుదైన మొక్కల జాబితాను తయారు చేయండి

ABN, First Publish Date - 2022-10-08T06:06:29+05:30

నగరంలో ఉన్న కొండలమీద ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పర్వతం మీద అరుదైన మొక్కలు, సరీసృపాలు ఉన్నాయని వాటి జాబితాను కళాశాల విద్యార్థులు తయారు చేయాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ ఫరీదా టంపాల్‌ విజ్జప్తి చేశారు.

మాట్లాడుతున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ ఫరీదా టంపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరుదైన మొక్కల జాబితాను తయారు చేయండి

డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌  ఇండియా సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌  ఫరీదా టంపాల్‌

మొగల్రాజపురం, అక్టోబరు 7: నగరంలో ఉన్న కొండలమీద ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పర్వతం మీద అరుదైన మొక్కలు, సరీసృపాలు ఉన్నాయని వాటి జాబితాను కళాశాల విద్యార్థులు తయారు చేయాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌  ఇండియా సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌  ఫరీదా టంపాల్‌ విజ్జప్తి చేశారు. జాతీయ వన్యప్రాణి వారోత్స వాలలో భాగంగా ఏపీ అటవీ శాఖ, అమరావతి బోటింగ్‌ క్లబ్‌ సహకారంతో  డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌  ఇండియా సంస్థ పీబీ సిద్ధార్థ కళాశాలలో శుక్రవారం విజయవాడ సిటిజన్‌ ఫర్‌ బయోడైవర్సిటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఏటా అక్టోబరు మొదటి వారంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిలో జీవ వైవిద్యాన్ని  ఎటువంటి అంశాలు దెబ్బతీస్తున్నాయో,  దేశ పౌరులుగా జీవ వైవిద్యాన్ని సంరక్షించడంలో ఎలా పాలు పంచుకోవాలో వివరించారు. పక్షులను, కీటకాలను, మొక్కలను ఎలా  గుర్తించాలో, వాటి లక్షణాలను  వివరించారు. ఎన్టీయార్‌ జిల్లా అటవీ శాఖాధికారి శ్రీ అప్పన్న, అమరావతి బోట్‌ క్లబ్‌ సీఈవో తరుణ్‌ కాకాని, సిద్ధార్థ కళాశాల డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌  మేకా రమేష్‌, జంతు శాస్త్ర విభాగాధిపతి వెంకటేశ్వర్లు, సీనియర్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ షరీష్‌, యోగేష్‌, డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ వెంకటేష్‌, సలోమీ, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T06:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising