ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ముగిసిన కూచిపూడి దినోత్సవం

ABN, First Publish Date - 2022-10-17T06:31:45+05:30

సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్స్‌, జయహో భారతీయం, ముమ్మనేని సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ మూడో కూచిపూడి నాట్య దినోత్సవంలో ఆదివారం 69 బృందాలు, 570 మంది నాట్య ప్రదర్శన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ కల్చరల్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్స్‌, జయహో భారతీయం, ముమ్మనేని సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ మూడో కూచిపూడి నాట్య దినోత్సవంలో ఆదివారం 69 బృందాలు, 570 మంది నాట్య ప్రదర్శన చేశారు. సత్యనారాయణపురం సంగీత కళాశాలలో సాయంత్రం ఏకకాలంలో 570 మంది మహాబృంద నాట్యం చేశారు. వినాయక కౌత్వం, కొలువైతివా అంశాలతో నాట్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను అలరించారు. సిద్ధేంద్ర యోగి కళాపీఠం ప్రిన్సిపాల్‌ రామలింగ శాస్త్రి రూపొంచిన అర్థశాంకరం నృత్యరూపకం కనువిందు చేసింది. వైస్‌ ప్రిన్సిపాల్‌ చింతా రవిబాలకృష్ణ బృందం ప్రదర్శించిన మోహినీ భస్మాసుర నృత్యం అలరించింది. దక్షిణాఫ్రికా, తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేణుమాధవ్‌ ఎలిగేటికి ఆత్మీయ సత్కారం నిర్వహించారు. వారితోపాటు కౌతా సుబ్బారావు, డోగిపర్తి శంకరరావు, సిల్వెస్టర్‌, నాట్యాచార్యుడు కేవీ సత్యనారాయణ, రామలింగశాస్త్రి, రవిబాలకృష్ణతోపాటు 80 మంది నాట్యగురువులకు సత్కారం చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐఆర్‌ఎస్‌ అధికారిణి వి.కోటేశ్వరమ్మ కూచిపూడి నాట్య మూలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. విద్యార్థులకు అక్షయపాత్ర భోజన సదుపాయం ఏర్పాటు చేసింది. సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్స్‌ వ్యవస్థాపకురాలు భావన, నాట్యాచార్యుడు ఘంటసాల పవన్‌కుమార్‌, జయహోం భారతీయం అధ్యక్షుడు ఎం.వలీశ్వర్‌, నాట్యాచారిణి వెంకటలక్ష్మి, శైలజ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T06:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising