ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna జిల్లా: తమవారు క్షేమంగా తిరిగి రావాలని గంగమ్మకు పూజలు

ABN, First Publish Date - 2022-07-07T16:34:38+05:30

మచిలీపట్నం (Machilipatnam)లో నలుగురు మత్స్యకారుల గల్లంతు ఘటన కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా (Krishna) జిల్లా: మచిలీపట్నం (Machilipatnam)లో నలుగురు మత్స్యకారుల గల్లంతు ఘటన కలకలం రేపుతోంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఐదు రోజులైనా వారి జాడ ఇంతవరకు లభించలేదు. దీంతో కోస్టు గార్డు (Coast Guard) బృందాలు రంగంలోకి దిగాయి. మత్స్యకారుల ఆచూకీ దొరక్కపోవడంతో క్యాంప్‌బెల్‌ పేట గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. 


ఆదివారం రాత్రి కాకినాడ (Kakinada) సమీపంలో అంతర్వేది దగ్గర బోటు మోటార్ పనిచేయడంలేదని యజమానికి మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వారి ఫోన్లు కూడా పనిచేయలేదు. ఈ క్రమంలో అధికారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. కాకినాడ సమీపంలోని అంతర్వేది దగ్గర బోటు మునిగి ఉండవచ్చునని, ఏ తీరానికైనా కొట్టుకుపోయి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గాలింపు చర్యలకు వాతావరణం అనుకూలించకపోవడంతో నిలిపివేశారు. వాతావరణం చక్కబడిన తర్వాత గాలింపు చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. అయితే తమ వారు క్షేమంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. గంగమ్మ తల్లినే నమ్ముకున్న తమకు గంగమ్మ అన్యాయం చేయదని, వారిని సురక్షితంగా ఇంటికి చేర్చాలంటూ గంగమ్మకు సంప్రదాయ పద్ధతిలో శాంతి పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-07-07T16:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising