ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ మహానాడు వైపే అందరి చూపు..: TDP

ABN, First Publish Date - 2022-06-26T20:55:19+05:30

ప్రపంచంలోని తెలుగు వారంతా టీడీపీ మినీ మహానాడు వేపే చూస్తున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం (Machilipatnam), (కృష్ణాజిల్లా): ప్రపంచంలోని తెలుగు వారంతా ఈ నెల 29న గుడివాడ (Gudivada)లో జరగనున్న టీడీపీ మినీ మహానాడు (TDP Mini Mahanadu) వైపే చూస్తున్నారని ఆ పార్టీ నేతలు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఆదివారం మచిలీపట్నం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు (TDP Leaders) మినీ మహానాడు షెడ్యూల్‌ను వివరించారు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హనుమాన్ జంక్షన్ నుంచి చంద్రబాబు (Chandrababu) రోడ్ షోగా బయలుదేరుతారని, సాయంత్రం 5గంటలకు అంగలూరులోని సభా వేదికకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. రాత్రి 10 గంటలకు నిమ్మకూరులో బస చేసి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మచిలీపట్నంలోని గోల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జులతో సమీక్షిస్తారని చెప్పారు. అంగలూరు సభలో లక్షలాది మంది పాల్గొంటున్నారని, వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.

Updated Date - 2022-06-26T20:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising