ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణాజిల్లా: గుడివాడ అర్ఐ అరవింద్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్

ABN, First Publish Date - 2022-04-27T20:30:24+05:30

కృష్ణాజిల్లా: గుడివాడ అర్ఐ అరవింద్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: గుడివాడ అర్ఐ అరవింద్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అర్ఐపై పలు సెక్షన్ల కింద రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఐ, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ.. తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, రెడ్ విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు దాడి సూత్రధారి గంటా సురేష్‌ను పోలీసులు  అరెస్ట్ చేయలేదు. దాడికి గురైన ఆర్ఐపైనే కేసు నమోదు కావడంతో.. ఉద్యోగ సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.


కాగా గుడివాడలో అధికారపార్టీకి చెందిన మట్టి మాఫియా చెలరేగిపోయింది. గుడివాడ మండలం, మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై వైసీపీ మైనింగ్ మాఫియా దాడికి తెగబడింది. రెవెన్యూ అధికారిని జేసీబీతో తొక్కించేందుకు యత్నించింది. వైసీపీ నేత గంటా సురేష్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా రాత్రి సమయంలో మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐపై సురేష్ సోదరుడు కల్యాణ్ దాడికి దిగడమే కాకుండా జేసీబీతో తొక్కించేందుకు ప్రయత్నించాడు. 

Updated Date - 2022-04-27T20:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising