ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ‌ట్టి మాఫియాను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపై దాడిని ఖండించిన టీడీపీ

ABN, First Publish Date - 2022-04-22T16:40:55+05:30

గుడివాడ మండలం, మోటూరు గ్రామంలో వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలు చేస్తున్న ప్రాంతాన్ని టీడీపీ నేతలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: గుడివాడ మండలం, మోటూరు గ్రామంలో వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలు చేస్తున్న ప్రాంతాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గుడివాడ ఆర్ఐ అరవింద్‌పై వైసీపీ నేతల దాడులను ఖండిస్తున్నామన్నారు. వ్యవస్థలను నాశనం చేసేలా అధికారులపై వైసీపీ శ్రేణుల దాడులు అమానుషమన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గుడివాడలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గత నెల రోజులుగా నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా.. స్పందన లేదన్నారు. రెవెన్యూ అధికారిపై హత్యాయత్నం  చేసిన వైసీపీ  నేతలపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని రావి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా తన పొలంలో మట్టి తవ్వకాలు చేస్తున్నారని, ఇదేమిటని అడిగిన తనపై అధికార పార్టీ నేతలు దాడులకు దిగుతున్నారని భూ యజమాని సులోచనరావు తెలిపారు. కాగా ఆర్ఐపై దాడి చేసిన పది మందిని గుడివాడ రూరల్ మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-04-22T16:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising