వైసీపీ అప్రజాస్వామ్య విధానాలపై ఉద్యమించాలి
ABN, First Publish Date - 2022-11-11T02:00:12+05:30
వైసీపీ అప్రజాస్వామ్య విధానాలపై ఉద్యమించాలని మాజీ ఎంపీ, టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొ నకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు.
మచిలీపట్నం టౌన్, నవంబరు 10 : వైసీపీ అప్రజాస్వామ్య విధానాలపై ఉద్యమించాలని మాజీ ఎంపీ, టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొ నకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో గురువారం టీడీపీ పార్లమెంటరీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై కొనకళ్ల నారాయణరావు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలకు అనుబంఽధ సంఘాల ప్రతినిధులు అందుబాటులో ఉండి ప్రజాసమస్యలపై పోరాడాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజీల్, విద్యుత్ చార్జీలు చుక్కలనంటాయన్నారు. సిమెంటు ధరల పెరుగుదలతో భవనాల నిర్మాణం మరుగునపడిందన్నారు. దాళ్వాకు నీరివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ముస్లింలు, హిందువులకు పెళ్లి కానుకలు ఇవ్వడం లేదన్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ప్రశ్నించిన టీడీపీ నా యకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగట్టాలన్నారు. మచిలీపట్నం పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత మాట్లాడుతూ, రాను న్న కాలంలో మహిళలు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలుపుతామన్నారు. వాణిజ్య విభాగం అధ్యక్షుడు మాచిన శివకుమార్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలతో చిన్న వ్యాపారులు పూర్తిగా చితికిపోయారన్నారు. మచిలీపట్నం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు పిన్నింటి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ, అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలు పొదిలి లలిత, ఖాదర్ ఖాన్, బాజీ, షాహీద్, కొండవీటి శివ య్య, బాదర్ల కిషోర్, బత్తిన దాసు, బెల్లంకొండ ఏడుకొండలు, బాణావతు విజయ్, దండమూడి చౌదరి, నిమ్మగడ్డ సత్యసాయి, మాదివాడ నరసింహారావు, కొక్కిలిగడ్డ నరసింహారావు, వల్లూరుపల్లి గణేష్, దేవరపల్లి కోటయ్య, కుంబా శ్రీకృష్ణ, వీరాంజనేయులు, సుప్రవర్త, బత్తిన దాసు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-11T02:00:15+05:30 IST