ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబజార్ల పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి

ABN, First Publish Date - 2022-11-24T00:31:58+05:30

రైతుబజార్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభించాలని జేసీ ఎస్‌.నుపూర్‌ అజయ్‌ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్నాచౌక్‌, నవంబరు 23 : రైతుబజార్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభించాలని జేసీ ఎస్‌.నుపూర్‌ అజయ్‌ అధికారులను ఆదేశించారు. సాంబమూర్తి రోడ్‌, జీ ఎస్‌ రాజు రోడ్‌, కృష్ణలంక రైతుబజార్ల పనులను మార్కెటింగ్‌, రెవెన్యూ అధికారులతో కలిసి ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సాంబమూర్తి రోడ్డులోని రైతుబజారు ప్రహరీగోడ పనులు, ఆర్వో ప్లాంట్‌, టాయిలెట్ల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జీఎ్‌సరాజు రోడ్టులోని రైతుబజారులో ఆర్వో ప్లాంట్‌, ప్రహారిగోడ పనులు పూర్తిచేసి ప్లాస్టింగ్‌, షాపు నెంబర్లు వేయాలన్నారు. కృష్ణలంక రైతు బజారులో 3 నెలలుగా టాయిలె ట్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చి మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని అన్నా రు. పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేసి వినియోగదారులకు రైతుబజార్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించా రు. మార్కెటింగ్‌ ఏడీ కిషోర్‌, డీఈ ప్రసాద్‌ పాల్గొన్నారు.

సచివాలయాల ఆకస్మిక తనిఖీ

గాందీనగర్‌లోని 192, 193 సచివాలయాలను జేసీ నుపూర్‌ అజయ్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టి, మూమెంట్‌ రిజిస్ట్రర్లను పరిశీలించారు. సచివాలయాల పరిఽధిలోని ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఉద్యోగులు అందుబాటులో ఉండి సచివాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా సేవలందించాలన్నారు. సచివాలయ పరిధిలో అర్హులు, అనర్హుల జాబితా ప్రదర్శించాలన్నారు. మెరుగైన సేవలందించి ప్రజలను నుంచి ఎటువంటి ఫిర్యాదులు రానీయకుండా చూడాలని సచివాలయ ఉద్యోగులు, సిబ్బందిని జేసీ కోరారు.

Updated Date - 2022-11-24T00:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising