ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలను అణగదొక్కుతున్న జగన్‌ సర్కార్‌

ABN, First Publish Date - 2022-12-07T00:55:47+05:30

బీసీలను దారుణంగా అణగదొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.

నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ, డిసెంబరు 6: బీసీలను దారుణంగా అణగదొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ఆర్డీవో రవీంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సౌమ్య మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి చంద్రబాబు ఆదరణ వంటి పథకాలు అమలు చేశారన్నారు. రాయితీపై రుణాలు ఇచ్చి బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారన్నారు. విదేశీ విద్య కోసం కోట్లాది రూపాయలు వెచ్చించినట్లు చెప్పారు. సమాజంలో అత్యధికులైన బీసీలు వైసీపీ పాలనలో అన్ని విధాల వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పెద్దయెత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు.

తిరువూరు: చేతివృత్తులు కుల వృత్తులను నిర్వీర్యం చేస్తూ బీసీ వర్గాలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ విమర్శించారు. బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ మంగళవారం టీడీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో రెండో రోజు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సబ్‌ప్లాన్‌ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్ధల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. చేతివృత్తులు, కులవృత్తుల వారి అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందించారు. మాజీ జడ్పీచైర్‌పర్సన్‌ నల్లగట్ల సుధారాణి, కందిమళ్ల శేషగిరిరావు, పర్వతం శ్రీనివాసరావు, పంది శ్రీనివాసరావు, వెదురు వెంకటనర్సిరెడ్డి, వాసం మునియ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising